ఏప్రిల్ 11న జరిగే పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ములుగు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో రెండు లక్షల 14వేల మంది ఓటర్లు ఉన్నారని, 302 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. వికలాంగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వీల్ఛైర్లు, ప్రత్యేక వాలంటీర్లను నియమించామని తెలిపారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: ఎన్నికల ఏర్పాట్లపై రజత్‌కుమార్‌తో ముఖాముఖి