రాష్ట్ర గ్రామీణ ప్రాంతాల స్థానిక సంస్థల అధికార బదలాయింపు నేటి నుంచి ప్రారంభం కానుంది. పాత పాలకవర్గాల పదవీకాలం నిన్నటితో ముగిసినందున కొత్త పాలకమండళ్లు కొలువుదీరనున్నాయి. గతంలో ఉన్న మండలాలు సహా నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఏర్పాటైన మండలాలు కలిపితే రాష్ట్రంలోని ఈ సంఖ్య 539కి చేరుకుంది. కొన్నింటిని మినహాయిస్తే అన్ని పాత మండల ప్రజాపరిషత్‌ల పాలకమండళ్ల పదవీకాలం నిన్నటితో ముగిసింది. ఇటీవల 536 పరిషత్‌లకు ఎన్నికలు పూర్తయ్యాయి. బూర్గంపాడు, జడ్చర్ల, మంగపేట మండలాల ఎన్నికలు జరగలేదు.
అక్కడ మాత్రం ఆగస్టు 6న
ప్రలోభాలకు ఆస్కారం ఉండరాదన్న ఉద్దేశంతో పదవీకాలం ప్రారంభం కాకముందే, ఎంపీటీసీల ప్రమాణస్వీకారానికి ముందే అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలను ప్రభుత్వం పూర్తి చేసింది. నాగర్ కర్నూల్ ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ ఆగిపోయింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని అన్నింటితో పాటు మహబూబాబాద్ జిల్లాలోని గార్ల, బయ్యారం, ములుగు జిల్లాలోని వాజీడు, వెంకటాపూరం ఎంపీపీల పదవీకాలం వచ్చే నెలలో ముగియనుంది. అక్కడ వచ్చే నెల ఆరో తేదీన కొత్త పాలకవర్గాలు కొలువుదీరుతాయి.
ఇవాళ ప్రమాణస్వీకారం
రాష్ట్రంలోని మిగతా మండల ప్రజాపరిషత్‌ల పాలకవర్గాలన్నీ ఈ రోజే సమావేశం కానున్నాయి. పాలకవర్గాల పదవీకాలం ఇవాళ్టితో ప్రారంభం కానుంది. మొత్తం 490 మండల ప్రజాపరిషత్ కొత్త పాలకమండళ్ల మొదటి సమావేశం ఇవాళ జరగనుంది. మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఎంపీటీసీలతో పాటు కోఆప్షన్ సభ్యులు ఈరోజు ప్రమాణస్వీకారం చేస్తారు.
ఇవీ చూడండి: "ప్రవేశాలలోపు రుసుములు ఖరారు చెయ్యండి"