*అల్లరి నరేశ్ హీరోగా నటించిన బంగారు బుల్లోడు విడుదల తేదీ ఖరారైంది. జనవరి 23న థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. పూజా జావేరి హీరోయిన్. గిరి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
*ధనుష్-సెల్వరాఘవన్ కాంబినేషన్లో తీస్తున్న కొత్త సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. 'నానే ఒరువన్' పేరుతో దీనిని తెరకెక్కిస్తున్నారు. ధనుష్ స్టైలిష్ లుక్ ఆకట్టుకుంటోంది.
*కీరవాణి కుమారుడు సింహా హీరోగా నటిస్తున్న రెండో సినిమా అప్డేట్ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. గురువారం సాయంత్రం 4:57 గంటలకు టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నారు. చిత్రశుక్లా హీరోయిన్గా నటిస్తోంది.
*ఉపేంద్ర 'కబ్జా' నుంచి క్రేజీ ఆప్డేట్ రానుంది. సంక్రాంతి రోజు ఉదయం 10 గంటలకు దీనిని రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు.
ఇవీ చదవండి: