ETV Bharat / briefs

కురిసింది వాన... తడిసింది నేల - రుతుపవనాలు

రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో చల్లని గాలుల వీస్తూ వర్షం కురుస్తోంది. ఇంతకాలం వేసవితో ఇబ్బంది పడ్డ ప్రజలు వర్షపు జల్లులను ఆస్వాదిస్తున్నారు.

వరద నీరు
author img

By

Published : Jun 23, 2019, 6:18 PM IST

Updated : Jun 23, 2019, 7:07 PM IST

కురిసింది వాన... తడిసింది నేల

నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి కురుస్తున్న తెలికపాటి చినుకులతో వాతావరణం చల్లబడింది. తీవ్ర ఉక్కపోతతో బాధపడుతున్న ప్రజలు తొలకరి జల్లులను ఆస్వాదిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌లో పిడుగుపాటుతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. 3 ఆవులు, 2 గేదెలు మృతిచెందాయి.

నగరంలో భారీ వర్షం

హైదరాబాద్​లోని పలుప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అబిడ్స్‌, నాంపల్లి, బషీర్‌బాగ్‌, నారాయణగూడ, బేగంబజార్‌, హిమాయత్‌నగర్‌, గచ్చిబౌలి, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, మలక్‌పేట, మూసారాంబాగ్‌, దిల్‌సుఖ్‌నగర్‌, హయత్​నగర్, అబ్దుల్లాపూర్​మెట్​లో మోస్తరు వర్షం కురిసింది. కూకట్‌పల్లి, మల్లాపూర్‌, చేవెళ్ల, షాబాద్‌, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్​లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. వర్షంతో రోడ్లన్నీ జలమయమ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. రోడ్లపై నిలిచిన నీటిని జీహెచ్​ఎంసీ, విపత్తు సహాయక బృందాలు నీటిని బయటకు పంపి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశాయి.

సికింద్రాబాద్​లో రోడ్లపై నీరు

సికింద్రాబాద్ కంటోన్మెంట్​లోని రోడ్లపై డ్రైనేజీలు పొంగి పొర్లుతోంది. మోకాలి లోతు వరకు నీరు రావడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చర్యలు తీసుకోవాలని నగరవాసులు జీహెచ్ఎంసీ అధికారులను కోరుతున్నారు.

వనపర్తిలో రెండు రోజులుగా వర్షం

వరంగల్​లో ఉదయం నుంచి పడుతున్న వర్షంతో నగరం తడిసిముద్దైంది. వనపర్తి జిల్లాలో గత రెండు, మూడు రోజులుగా తేలికపాటి జల్లులకు కురుస్తున్నాయి. చినుకులు పడడంతో అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

ఇదీ చూడండి: 'తెదేపా విలీన ప్రక్రియ పూర్తిగా రాజ్యాంగబద్ధమే'

Intro:Body:Conclusion:
Last Updated : Jun 23, 2019, 7:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.