మతోన్మాద ఎజెండాతో పాలన సాగించిన మోదీ సర్కారును గద్దె దించి దేశాన్ని కాపాడాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారాట్ అన్నారు. భాజపా హయాంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమయ్యాయని ఆరోపించారు. పార్టీలు మారే వారిని కాకుండా ప్రజా గొంతుకను పార్లమెంటులో వినిపించే వారికి ఓటు వేయాలని కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సీపీఎం అభ్యర్థి మల్లు లక్ష్మి, ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి బృందా కారాట్ రోడ్‌షో నిర్వహించారు. లోక్‌సభలో సమస్యల పట్ల మాట్లాడకుండా తెరాస ఎంపీలు మౌనంగా కూర్చున్నారని ఎద్దేవా చేశారు. కవిత పట్ల ఉన్న వ్యతిరేకతతో రైతులు నామినేషన్ వేసి నిరసన ప్రకటించారన్నారు. ప్రజల పక్షాన నిలబడే వామపక్ష అభ్యర్థులను గెలిపించాలని కారాట్ విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి:"గెలిస్తే పసుపు బోర్డు, మద్దతు ధర ఇస్తాం"