ఖమ్మం జిల్లా కేంద్రంలో 300 కోట్ల రూపాయలతో ఇంటింటికి మంచినీటి సరఫరా చేస్తామని ఎమ్మెల్యే అజయ్ కుమార్ చెప్పారు. ఖమ్మం 39వ డివిజన్‌లో మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఇంటింటికి వేసిన పంపులను ప్రారంభించారు. ప్రతి ఇంటికి వెళ్లి కొబ్బరి కాయలు కొట్టి బిందెల్లో నీటిని పట్టారు. పాలేరు జలాశయం నుంచి శుద్ధి చేసిన జలాలను నగరంలోని ప్రతి ఇంటికి చేర్చటమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.
ఇవీ చూడండి: లాసెట్, పీజీ ఎల్సెట్ ఫలితాలు విడుదల