అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్న తెదేపా నేతలు.. చర్చకు సిద్ధమా అని ఏపీ మంత్రి పేర్ని నాని సవాల్ చేశారు. చర్చకు వస్తే ఆధారాలతో సహా అవినీతిని నిరూపిస్తామన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టుపై స్పందించిన మంత్రి పేర్ని నాని.. 2018లో నకిలీ దస్త్రాలతో 98 లారీల ఛాసిస్‌లు నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేశారన్నారు.
అనంతపురంలో 29, కర్నూలు జిల్లాలో 3 లారీలకు రిజిస్ట్రేషన్ చేశారన్న ఆయన.. లారీలు రిజిస్ట్రేషన్ చేయడమే తప్పయితే వాటిని బస్సులుగా మార్చి తిప్పారని ఆరోపించారు. నకిలీ ఎన్‌ఓసీ సృష్టించి మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు. నకిలీ ఎన్‌ఓసీలు సృష్టించినందుకు జేసీ ట్రావెల్స్‌పై కేసులు నమోదయ్యాయన్నారు. 101 నిషేధిత లారీల్లో 97కు రిజిస్ట్రేషన్ రద్దయ్యాయని మంత్రి స్పష్టం చేశారు. లారీలను బస్సులుగా మార్చిన మూడింటిని అధికారులు సీజ్ చేశారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : 'ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పితే కేసులా..?'