ఉపాధి హామీ పథకం అమలులో జవాబుదారీతనాన్ని పెంపొందించాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. హరితహారంలో భాగంగా ప్రతి కుటుంబానికి ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేసి వాటిని పెంచేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. చింత, వేప చెట్లను విరివిగా నాటించి వాటి సంరక్షణకు సర్పంచ్, కార్యదర్శిని భాగస్వామిని చేయాలని సూచించారు. ఉపాధి హామీ నిధులతో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోను పంచాయతీ భవనాల నిర్మాణంతోపాటు, డంపింగ్‌యార్డులు, స్మశానవాటికల నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు.
పథకం ప్రారంభం నుంచి 2018-19లో అత్యధికంగా 42లక్షలకు పైగా కూలీలకు వంద రోజుల పనిదినాలను కల్పించి రూ.3027 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు వివరించారు. 2019-20కి గాను కేంద్ర ప్రభుత్వం 12 కోట్ల పనిదినాలను అమోదించగా... ఇప్పటి వరకు రూ.947 కోట్లతో 5 కోట్ల 70 లక్షల పనిదినాలు కల్పించినట్లు తెలిపారు. సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డితో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ప్రత్యేక పూజలు చేసిన మంత్రి ఎర్రబెల్లి