నెల రోజుల క్రితం దిల్లీలో జరిగిన షూటింగ్ ప్రపంచకప్లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది సౌరభ్-మనుద్వయం. ప్రస్తుతం తైవాన్లో జరుగుతున్న ఆసియన్ ఎయిర్ గన్ ఛాంపియన్షిప్ అర్హత రౌండ్లో 784 పాయింట్లు సాధించారు. తద్వారా... యూరోపియన్ ఛాంపియన్షిప్లో ఐదు రోజుల క్రితం నమోదైన రికార్డును తిరగరాశారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం విభాగంలో బంగారు పతకం సాధించారు.
ఐదు జట్లు పాల్గొన్న ఈ ఛాంపియన్షిప్ తుదిపోరులో 484.4 పాయింట్లు సాధించిన సౌరభ్-మను ద్వయం బంగారు పతకం సాధించింది.
481.1 పాయింట్లతో కొరియా షూటర్లు.. హ్వాంగ్-కిమ్ జోడి వెండి పతాకాన్ని గెలుపొందారు.
భారత్ తరఫున ఫైనల్లో పాల్గొన్న మరో జోడి అనురాధ-అభిషేక్ వర్మ.. 372.1 పాయింట్లు సాధించి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు.