సూపర్‌స్టార్ మహేశ్‌బాబు పండెక్కి సందడి చేయనున్నాడు. మొదట ఉగాదికే 'మహర్షి' సినిమాను రిలీజ్ చేద్దామని భావించినా అనివార్య కారణాల వల్ల సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు అదే రోజున సినిమా టీజర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.మే 9న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని ఇది వరకే నిర్మాత దిల్‌రాజు ప్రకటించారు. మహేష్ పుట్టినరోజు కానుకగా ఇప్పటికే విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకోనుంది. ఎన్నికల అనంతరం ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు. ఈ సినిమాలో హీరో రెండు పాత్రల్లో కనిపించనున్నాడని సమాచారం.
పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా, అల్లరి నరేశ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">