కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రమే మారనుందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఫడణవీస్ విచ్చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపారు. ప్రాజెక్ట్‌ను మహారాష్ట్ర ప్రజలు తెలంగాణకు అందించిన కానుకగా పేర్కొన్నారు. రికార్డు వేగంతో ప్రభుత్వం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిందని కొనియాడారు.
మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టులు తెలంగాణకు మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన బహుమతి. మా ప్రధాని నరేంద్ర మోదీ సహకార సమాఖ్య విధానం ఉండాలని మాకు నిర్దేశించారు. ఆ ప్రకారమే మేం... తెలంగాణకు సహకరించాం. తెలంగాణ చాలా వేగంగా ఈ ప్రాజెక్టు పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టుతో తెలంగాణ ముఖ చిత్రమే మారిపోతుంది. చాలాకాలం ఈ సమస్య ఉంది. మేం కూర్చొని సమస్య పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నాం. వృథాగా పోయే గోదావరి జలాలు రైతులకు ఉపయోగపడాలని కేసీఆర్ చెప్పిన దానికి నేను అంగీకరించా. చివరగా ఈ ప్రాజెక్టు పూర్తైంది. తెలంగాణ ముఖ్యమంత్రికి, ప్రజలకు నేను అభినందనలు తెలియజేస్తున్నా..
ఇవీ చూడండి: కన్నెపల్లి పంపుహౌస్ నుంచి విడుదలైన జీవధార