లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండటం వల్ల కరీంనగర్లో ఎల్ఈడీ స్క్రీన్లతో కూడిన ప్రచార రథాలను ఎంపీ వినోద్‌కుమార్ ప్రారంభించారు. ఈ వాహనాల ద్వారా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రజలు తెరాస పార్టీకి మద్దతు ఇస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు.
ఇవీ చూడండి: ప్రచారంలో పాల్గొనాలనే కోరిక ప్రాణం తీసింది