నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం కుడుకిల్లలో రైతులు పాలమూరు-రంగారెడ్డి పథకం ప్రధాన కాలువ సర్వేను అడ్డుకున్నారు. గతంలో మహాత్మ గాంధీ ఎత్తిపోతల పథకం... మిషన్ భగీరథకు భూములు ఇచ్చామని గ్రామస్థులు తెలిపారు. మిగిలిన పొలాల్లో పంటలు వేసుకొని జీవిస్తున్న సమయంలో మళ్లీ భూములు ఇమ్మంటే ఎక్కడికిపోయి బతకాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల మంది పోలీసులతో వస్తే భయపడే ప్రసక్తే లేదని మండిపడ్డారు. అధికారులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా... పెట్రోల్ సీసాలతో నిరసన వ్యక్తం చేశారు. చచ్చిపోవటానికైనా సిద్ధమే కానీ తమ భూములు మాత్రం ఇవ్వబోమని రైతులు తెగేసి చెబుతున్నారు.
ఇవీ చూడండి: కొత్త అసెంబ్లీ, సచివాలయ నిర్మాణాలకు శంకుస్థాపన