హైదరాబాద్‌పై చంద్రబాబు శాపాలు పెడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. వికారాబాద్ తెరాస బహిరంగ సభలో పాల్గొన్న ఆయన... ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేశవరావు రాజ్యసభలో, ఎంపీలు లోక్‌సభలో మాట్లాడారని గుర్తు చేశారు. తెలంగాణలో ఎంఐఎంతో కలుపుకుని కచ్చితంగా 17 ఎంపీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్రెడ్డి గెలుస్తారని జోస్యం చెప్పారు. తెరాస, వైకాపా కలుపుకుని 35 లేదా 36 ఎంపీ స్థానాలు గెలుస్తామని అన్నారు గులాబీ బాస్. ఆంధ్ర ప్రజలతో తనకెప్పుడూ పంచాయితీ లేదని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: ఒకే ధ్యేయం-ఒకే దిశ : నరేంద్రమోదీ