ETV Bharat / briefs

కాళేశ్వరం ఆరో ప్యాకేజీ ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి - కాళేశ్వరం ఆరో ప్యాకేజీ పంప్​హౌస్​ను ప్రారంభించిన మంత్రి

పెద్దపల్లి జిల్లా నంది మేడారంలో కాళేశ్వరం ఆరో ప్యాకేజీ పంప్​హౌస్​ను రాష్ట్ర కార్మిక మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. మొదట ప్రాజెక్ట్​ పరిసరాలు, ఇతర నిర్మాణాలను పరిశీలించిన మంత్రి ప్రత్యేక పూజల  చేసిన తర్వాత కంప్యూటర్​ ద్వారా పంప్​హౌస్​ను ప్రారంభించారు.

కాళేశ్వరం ఆరో ప్యాకేజీ ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి
author img

By

Published : Jun 21, 2019, 5:01 PM IST

కాళేశ్వరం ఆరో ప్యాకేజీ ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలో కాళేశ్వరంలో ఆరో ప్యాకేజీ పంప్​ హౌస్​​ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. ఉదయమే ప్రాజెక్టు వద్దకు చేరుకున్న మంత్రి.. ఎల్లంపల్లి నుంచి నంది మేడారం వరకు నిర్మాణాలను పరిశీలించారు. భూగర్భంలోని విద్యుత్​ ఉపకేంద్రం, సర్జిపూల్​, డెలివరీ సిస్టర్న్​, లీడ్​ కెనాల్​, నంది మేడారం జలాశయాలను సందర్శించారు. నిర్మాణ విశేషాలను, పంప్​హౌస్​ పనితీరును నీటిపారుదలశాఖ ఈఈ శ్రీధర్​ మంత్రికి వివరించారు. ప్రత్యేక పూజల అనంతరం కంప్యూటర్​తో పంప్​హౌస్​ను ప్రారంభించారు.

ఇవీ చూడండి: కన్నెపల్లి పంపుహౌస్​ నుంచి విడుదలైన జీవధార

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.