కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య నేడు ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు చెరో విజయం అందుకుని ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నాయి. సన్‌రైజర్స్‌పై అద్భుతం చేసి గెలిచిన జట్టు ఓ వైపు, గేల్ మెరుపులపై ధీమాగా ఉన్న జట్టు మరోవైపు.. కోల్‌కతా వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి.
రాజస్థాన్, పంజాబ్ మధ్య సోమవారం జరిగిన మ్యాచ్‌లో బట్లర్‌ని అశ్విన్ 'మన్కడింగ్' ద్వారా ఔట్ చేశాడు. ప్రస్తుతం ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. నాన్ స్టైకర్ ఎండ్‌లో ఉన్న బట్లర్.. అశ్విన్ బౌలింగ్‌లో క్రీజు దాటి ముందుకు కదిలాడు. ఎలాంటి హెచ్చరిక లేకుండానే బట్లర్‌ని రనౌట్ చేశాడు అశ్విన్. క్రికెట్ నిబంధనలకు ఇది వ్యతిరేకం కానప్పటికీ క్రీడా స్ఫూర్తిని దెబ్బతీస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రాజస్థాన్‌పై జరిగిన మ్యాచ్‌లో గేల్ 47 బంతుల్లో 79 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోరు అందించాడు. యువ క్రికెటర్ సర్ఫరాజ్ 47 పరుగులతో రాణించి నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరు ఫామ్‌లో ఉండటం పంజాబ్‌కి కలిసి రానుంది.
అశ్విన్, ముజీబర్ రెహమాన్, సామ్ కురాన్ గత మ్యాచ్‌లో బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు.
మరోవైపు కోల్‌కతా జట్టు హైదరాబాద్‌పై ఉత్కంఠభరిత విజయాన్నందుకుని ఊపు మీదుంది. గత మ్యాచ్‌లో ఆండ్రీ రసెల్ 19 బంతుల్లో 49 పరుగులతో విజృభించాడు. నితీశ్ రానా అర్ధ శతకంతో విజయంలో కీలక పాత్ర పోషించాడు.
బౌలింగ్‌లో సునీల్ నరైన్, రసెల్, పీయూష్ చావ్లాలు కీలకం కానున్నారు. చేతి వేలికి గాయమైన నరైన్ ఈ మ్యాచ్‌లో అందుబాటులో ఉంటాడో లేదో తెలియాల్సి ఉంది.
జట్లు(అంచనా)
కోల్‌కతా నైట్ రైడర్స్:
దినేశ్ కార్తీక్(కెప్టెన్), రాబిన్ ఉతప్ప, క్రిస్ లిన్, శుభ్‌మన్ గిల్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, పీయూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్, నితీశ్ రానా, ప్రసిధ్ క్రిష్ణ, ల్యూకీ ఫెర్గుసన్
కింగ్స్ ఎలెవన్ పంజాబ్:
రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), సామ్ కర్రాన్, మహమ్మద్ షమి, సర్ఫరాజ్ ఖాన్, క్రిస్‌గేల్, కే ఎల్ రాహుల్, అంకిత్ రాజ్‌పుత్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, ముజీబర్ రెహమాన్, డేవిడ్ మిల్లర్