ETV Bharat / briefs

ఇంటర్మీడియట్ రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల

ఇంటర్‌ రీవెరిఫికేషన్‌లో 1,137 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫెయిలైన 3.82 లక్షల విద్యార్థుల సమాధాన పత్రాల రీవెరిఫికేషన్‌ పూర్తయింది. 19,788 జవాబు పత్రాల స్కానింగ్‌ పూర్తి కావల్సి ఉందని ఇంటర్‌ బోర్డు తెలిపింది.

ఇంటర్‌ రీవెరిఫికేషన్‌
author img

By

Published : May 27, 2019, 11:08 PM IST

Updated : May 28, 2019, 12:07 AM IST

ఇంటర్మీడియట్ రీవెరిఫికేషన్​లో ఫెయిలైన 1,137 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరంలో 585... రెండో సంవత్సరంలో 552 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో గందరగోళం తలెత్తడం వల్ల ప్రభుత్వం ఆదేశాల మేరకు 3 లక్షల 82వేల 116 మంది ఫెయిలైన విద్యార్థులకు సంబంధించిన 9 లక్షల 2వేల 429 సమాధాన పత్రాలను రీవెరిఫికేషన్ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ సాయంత్రం ఐదు గంటల వరకు ఫలితాలు, జవాబు పత్రాలను వెబ్​సైట్​లో వెల్లడించాల్సి ఉండగా... ఉదయం నుంచి విద్యార్థులు ఎదురు చూశారు. రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఇంటర్ బోర్డు పాసైన విద్యార్థుల హాల్ టికెట్ల వివరాలు ప్రకటించింది.

జూన్​ 12 తర్వాత..

మొత్తం 2 కోట్ల 25 లక్షల పేజీలను స్కానింగ్ చేసినట్లు పేర్కొన్న ఇంటర్ బోర్డు... 19వేల 788 జవాబు పత్రాలు ఇంకా స్కానింగ్, అప్​లోడ్ కావల్సి ఉందని తెలిపింది. ఈ రాత్రికి లేదా రేపు స్కానింగ్, అప్​లోడ్ ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించింది. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఫలితాలు మూడు రోజుల్లో ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.

రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం ఫీజు చెల్లించిన 21 వేల 537 మంది విద్యార్థులకు జూన్ 12 తర్వాత తిరిగి ఇవ్వనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. గ్లోబరీనాతో పాటు.. డేటా టెక్ మెథడిక్స్ అనే సంస్థ ఫలితాలను ప్రాసెసింగ్ చేసిందని.. జేఎన్​టీయూహెచ్ పర్యవేక్షించిందని బోర్డు పేర్కొంది.

ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల

ఇవీ చూడండి: 'రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించాలి'

Last Updated : May 28, 2019, 12:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.