ETV Bharat / briefs

బ్యాలెట్​ పత్రంపై వేలిముద్ర పడితే ఓటు చెల్లనట్టే - సిరా తుడిచేస్తే

స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఓటు వేస్తున్నారా? అయితే కాస్త జాగ్రత్త వహించండి. లేకపోతే మీ ఓటు చెల్లకుండా పోయే ప్రమాదముంది. పోలింగ్​ కేంద్రంలో కొంచెం అవగాహనతో వ్యవహరిస్తే ఈ సమస్య ఉండదు.

బ్యాలెట్​ పత్రంపై వేలిముద్ర పడితే ఓటు చెల్లనట్టే
author img

By

Published : May 4, 2019, 10:10 AM IST

బ్యాలెట్​ పత్రంపై వేలిముద్ర పడితే ఓటు చెల్లనట్టే

ప్రాదేశిక ఎన్నికల పోలింగ్​ కేంద్రాల్లో ఓటర్లు అవగాహనతో వ్యవహరించకుంటే.. ఓట్లు చెల్లకుండా పోయే ప్రమాదముంది. బ్యాలెట్‌ పత్రాలు తీసుకొనే ముందు - కౌంటర్‌ ఫాయిల్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. నిరక్ష్యరాస్యుల నుంచి వేలిముద్ర తీసుకుంటారు. బొటనవేలుకు అంటిన సిరాను తుడుచుకోకుండా బ్యాలెట్‌ పత్రాలను పట్టుకుంటే.. వాటిని మడిచేటప్పుడు వేలుకున్న సిరా ఆనవాళ్లు ఆ పేపర్​పై ఎక్కడో ఓచోట పడవచ్చు. నిబంధనల ప్రకారం పత్రంలోని ఒక అభ్యర్థి గడిలో రబ్బరుస్టాంపు గుర్తు తప్ప, వేరే ఏవైనా ఉంటే వాటిని చెల్లనివాటిగానే పరిగణిస్తారు.

బొటనవేలి సిరా తుడుచుకోవాలి

బొటనవేలిపై సిరాను ఓటరు శుభ్రంగా తుడుచుకోవాలి. అందుకోసం బల్లపై తడి గుడ్డను సిద్ధంగా ఉంచాలని ఎన్నికల సంఘం మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఎడమచేతి మధ్యవేలిపై వేసే సిరా గుర్తును మాత్రం చెరపకూడదు. ఓటు వేసి వెళ్లిపోయేటప్పుడు, పోలింగ్‌ సిబ్బంది అతడి వేలిని చూసి నిర్ధరించుకోవాలని ఈసీ పేర్కొంది.

స్టాంపు ముద్ర మాత్రమే

ప్రతి బ్యాలెట్‌ పత్రంలోనూ అభ్యర్థుల పేర్లు, చిహ్నాలు ముద్రించి ఉంటాయి. రబ్బరు స్టాంపుతో ముద్రను వేయడానికి ఓటింగ్‌ కంపార్టుమెంటులో బల్ల అందుబాటులో ఉంటుంది. పత్రంలో రబ్బరు స్టాంపు ముద్ర తప్ప ఇంకేవీ ఉండకూడదు. బొటనవేలి ముద్ర, ఓటరు పేరు, సంతకం, రాతలు వంటివి ఏవి కనిపించినా...ఆయా ఓట్లను కౌంటింగ్‌ సమయంలో తిరస్కరిస్తారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్లకు ఒకే బ్యాలెట్‌ బాక్సు ఉంటుంది.

ఇదీ చూడండి : ప్రాదేశిక ఎన్నికల్లో 1.56 కోట్ల మంది ఓటర్లు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.