చర్యలు తప్పవు:
కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన మంత్రి... అటువంటి కంపెనీలపై నిరంతరం నిఘా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పర్యవరణ పరిరక్షణ కోసం ముందు చూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యలను చిత్తశుద్ధితో అమలు చేయాలని స్పష్టం చేశారు.
ఆదర్శంగా:
రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ప్లాస్టిక్‌ను నిషేధించి.. ప్రత్యామ్నాయంగా జనపనార, గుడ్డ సంచులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లను తయారు చేస్తున్న కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ముంబయి తరహాలో ప్లాస్టిక్ రహిత తెలంగాణగా మార్చేందుకు చొరవ చూపాలన్న మంత్రి... ప్రజలు కూడా సామాజిక బాధ్యతగా వినియోగం తగ్గించాలని కోరారు.
తనిఖీలు చేయండి:
కాలం చెల్లిన వాహనాల నుంచి వచ్చే కర్బన ఉద్ఘారాల వల్ల గాలి కలుషితమవుతోందని... అటువంటి వాహనాలకు చెక్ పెట్టేలా నిరంతరం కాలుష్య ప్రమాణ తనిఖీలు నిర్వహించాలని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. వాయు కాలుష్యంపై అధ్యయనం చేసి నివేదికలు అందించాలని అధికారులను ఆదేశించారు.
ఇవీ చూడండి:'ఇది ఛాయ్‌వాలా పథకం'