ETV Bharat / briefs

డోపింగ్ కారణంగా భారత అథ్లెట్​పై నాలుగేళ్ల నిషేధం

భారత షాట్​పుట్ ఆటగాడు​ నవీన్​ చికారా నాలుగేళ్లపాటు సస్పెండ్​ అయ్యాడు. 2018లో జరిగిన టోర్నీల్లో నిషేధ ఉత్ప్రేరకాలు తీసుకోవటమే అందుకు కారణమని ఇంటర్నేషనల్ అసోషియేషన్ ఆఫ్ అథ్లెటిక్ ఫెడరేషన్ (ఐఏఏఎఫ్​) తెలిపింది.

Indian shot putter Navin Chikara suspended for four years for flunking dope test
షాట్​ పుటర్​ నవీన్​ చికారాకు నాలుగేళ్ల నిషేధం
author img

By

Published : Mar 28, 2020, 11:20 AM IST

Updated : Mar 28, 2020, 11:41 AM IST

భారత షాట్​పుట్ ఆటగాడు​ నవీన్​ చికారాను నాలుగేళ్లపాటు సస్పెండ్​ చేసింది గ్లోబల్ అథ్లెటిక్స్ యూనిట్. 2018లో నిర్వహించిన ఔట్ కాంపిటీషన్ డోప్ పరీక్షలో నిషేధిత ఉత్ప్రేరకాలు ఉపయోగించాడని తేలడం వల్ల ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో అతడి సస్పెన్షన్​ కాలం 2018 జులై 27 నుంచి అమలులోకి వస్తుందని అంతర్జాతీయ వ్యాయామక్రీడల సమాఖ్య(ఐఏఏఎఫ్) ఇంటెగ్రిటీ యూనిట్ శుక్రవారం తెలిపింది.

2018 జులై 27న పాటియాలాలోని జాతీయ డోపింగ్​ నిరోధక సంస్థ నియమాల మేరకు అథ్లెట్లు పోటీలో పాల్గొనే ముందు నిర్వహించే డోపింగ్​ నిర్ధారణ పరీక్షకు నవీన్​ చికారా హాజరయ్యాడు. అదే ఏడాది అక్టోబరు 28న కెనడా మాంట్రియల్​లోని డోపింగ్​ ఏజెన్సీ ప్రయోగశాలలో నిర్వహించిన పరీక్షల్లో ఉత్పేరకాలు తీసుకున్నట్టు తేలింది.

నవీన్ 2018లో జరిగిన ఇంటర్-స్టేట్ ఛాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలవగా.. ఫెడరేషన్ కప్‌లో రజత పతకాన్ని సాధించాడు. ఆ తర్వాత నవంబర్ నుంచి తాత్కాలిక నిషేధాన్ని ఎదుర్కొన్న చికారా.. డిసెంబరులో ఆ నిషేధిక ఉత్పేరకం ఏంటో తెలియదని వెల్లడించాడు. అయితే యాంటీ డోపింగ్​ ఉల్లంఘన చేసినట్టు అతడు తాజాగా అంగీకరించడం వల్ల నాలుగేళ్ల పాటు నిషేధానికి గురయ్యాడు.

ఇదీ చూడండి.. విశ్వక్రీడల వాయిదా ఖరీదెంత!

Last Updated : Mar 28, 2020, 11:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.