తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన వేదవ్యాస్ అనే తొమ్మిదో తరగతి విద్యార్థి ట్వీట్ చేశాడు. ఉప్పల్‌లోని తమ పాఠశాలలో జూన్ 1న తరగతులు ప్రారంభిస్తున్నారని వేదవ్యాస్ ఫిర్యాదు చేశాడు. అయితే బడులకు జూన్ 11 వరకు వేసవి సెలవులు పొడగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెల 1 నుంచి ఒంటిపూట తరగతులు నిర్వహిస్తున్నారన్న విద్యార్థి ట్వీట్‌కు కేటీఆర్ స్పందించారు. సెలవుల విషయంలో నిబంధనలు పాటించేలా చూడాలని విద్యాశాఖ మంత్రికి సూచించారు.
ఇవీ చూడండి: ఒకే విమానంలో గవర్నర్, కేసీఆర్, జగన్