ETV Bharat / briefs

'భూ సేకరణ విషయంలో మా ఆదేశాలనే ధిక్కరిస్తారా...?' - కాళేశ్వరం ప్రాజెక్టు భూ సేకరణ విషయంలో హైకోర్టు ఆగ్రహం

కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ విషయంలో అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తొగుటలో భూ సేకరణపై తమ ఆదేశాలను ధిక్కరించినందుకు నలుగురు అధికారులకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పిచ్చింది. అయితే అప్పీలు చేసుకునేందుకు వీలుగా ఆరు వారాల పాటు శిక్ష అమలును నిలిపివేసింది.

హైకోర్టు ఆగ్రహం
author img

By

Published : Jun 4, 2019, 5:07 AM IST

Updated : Jun 4, 2019, 6:54 AM IST

భూ సేకరణ విషయంలో అధికారులపై హైకోర్టు ఆగ్రహం
కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ వ్యవహారంలో కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు నలుగురు అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాజెక్టు ఏడో కన్​స్ట్రక్షన్స్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి.బద్రినారాయణ, రాఘవ కన్​స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్టు మేనేజర్ బి.శ్రీనివాసరెడ్డిలకు 3 నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరో వ్యాజ్యంలో రెండో డివిజన్​ ఇరిగేషన్​ విభాగం సూపరింటెండెంట్​ టి. వేణు, తొగుట ఎస్​ఐ శ్రీనివాసరెడ్డిలకు 2 నెలల జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా విధించింది. ఈ శిక్షలను అధికారుల సర్వీసు రికార్డుల్లో నమోదు చేయాలని న్యాయస్థానం పేర్కొంది.

అప్పీలుకు అవకాశం

అధికారులు అప్పీలు చేసుకునేందుకు వీలుగా శిక్షల అమలును 6 వారాల పాటు నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేట జిల్లా తొగుటలో పరిహారం చెల్లించకుండా పనులు చేపట్టవద్దంటూ గతంలో ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. అయితే తీర్పును ఉల్లంఘించి... పోలీసులతో బెదిరిస్తూ బలవంతంగా భూములును స్వాధీనం చేసుకుని పనులు చేయిస్తున్నారని కొందరు కోర్టు ధిక్కరణ కింద వ్యాజ్యాలు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నలుగురు అధికారులపై చర్యలకు ఉపక్రమించింది.

ఇదీ చూడండి : హైకోర్టులోనే తేల్చుకోండి రవిప్రకాశ్​కు సుప్రీం సూచన

Intro:సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండలం లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం.

Body:మండల కేంద్రమైన మిరుదొడ్డి లో ఆకాశమంత ఒక్కసారి నీలి రంగుకు మారి మేఘావృతమై ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది.
ఒక్కసారిగా కురిసిన వర్షంతో వాతావరణం అంతా చల్లబడింది. ఈదురు గాలు లు, ఉరుములు మెరుపులతో వర్షం వచ్చింది.
ఒక్కసారిగా కురిసిన వర్షం వల్ల రోడ్ల పైన అక్కడ అక్కడ నీరు నిలిచాయి.
ఈదురు గాలుల వల్ల గ్రామంలో ఉన్న ఫ్లడ్ లైట్ విరిగిపడింది. వర్షం తగ్గిన తర్వాత గ్రామ అధికారులు జెసిబి సహాయంతో విరిగిపడిన ఫ్లడ్ లైట్ ను రోడ్డు మీద నుండి తొలగించి వేశారు.

Conclusion:పొద్దున నుండి అంతా వేడిగా ఉన్న వాతావరణం ఉరుములు మెరుపులు మరియు ఈదురుగాలులతో కూడిన వర్షం రావడం వలన వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో గ్రామంలో చల్లటి వాతావరణం నెలకొంది.
Last Updated : Jun 4, 2019, 6:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.