తెలంగాణ యాసలో... చేనేత కార్మికుల కష్టాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించిన మల్లేశం చిత్ర యూనిట్‌ను సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. మల్లేశం చిత్ర హీరో, హీరోయిన్, డైరెక్టర్‌తో వెస్ట్‌మారేడ్‌పల్లిలోని తన నివాసంతో మంత్రి అల్పాహారం సేవించారు. సినిమా అద్భుతంగా ఉందని ఇలాంటి సినిమాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి తెలిపారు. సినిమాకి పన్ను రాయితీ కల్పించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హీరోహీరోయిన్లు ప్రియదర్శి, అనన్య నటన సహజంగా ఉందని తలసాని సాయికిరణ్ కితాబిచ్చారు. సినిమాలో పలు అంశాలను సహజత్వంగా చిత్రీకరించారని తలసాని మెచ్చుకున్నారు. తన జీవితంలో మల్లేశం చిత్రం ఓ మలుపురాయని ప్రియదర్శి అన్నారు. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు, ప్రేక్షకులంతా తమ సినిమాను ఆదరిస్తున్నారని ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూడాలని కోరారు.
ఇవీ చూడండి: జల వివాదాలపై చర్చించనున్న కేసీఆర్, జగన్