అల్ ఖైదా సుప్రీమో ఒసామా బిన్ లాడెన్ కొడుకు హమ్జా బిన్ లాడెన్ అమెరికాకు ప్రమాదకరమని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. హమ్జా మృతి వార్త వచ్చిన అనంతరం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"నేను హమ్జా మృతి గురించి వ్యాఖ్యానించలేను. కానీ అతను మా దేశానికి చాలా ప్రమాదకారి. అమెరికాపై చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ట్రంప్ మొదటి రెండేళ్ల పాలనలోనే హమ్జా హతమయ్యాడని గురువారం అమెరికా పత్రికలు రాశాయి. కానీ ఈ వార్తలను అమెరికా అధికారులు ధ్రువీకరించలేదు.
"ఒక వేళ మృతి నిజమే అయితే అది అల్ ఖైదాకు మరో ఎదురుదెబ్బ. అమెరికా దాడులు, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థ వివరాలు తెలిసేందుకు దోహదం చేస్తాయి."-న్యూయార్క్ టైమ్స్
పత్రిక కథనం ప్రకారం హమ్జా వయస్సు 30 లోపేనని తెలుస్తోంది. ఆయన పేరు ఆధునిక ఉగ్రవాదంలో ఎంతో ప్రాచుర్యం పొందిందని పేర్కొంది. హమ్జా ప్రపంచ ఉగ్రవాదాన్ని ఒకతాటిపైకి తీసుకువచ్చేవాడని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: షోపియాన్లో ఎదురుకాల్పులు-ఇద్దరు జవాన్లకు గాయాలు