ETV Bharat / briefs

వ్యవసాయ రుణమాఫీపై ప్రభుత్వం కసరత్తు - మాఫీ

వ్యవసాయ రుణమాఫీ విధానాల ప్రకటనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. లక్ష రూపాయల్లోపు రైతుల పంటరుణాలను మాఫీ చేస్తామన్న ఎన్నికల హామీ అమలు కోసం సర్కార్ ఇప్పటికే బడ్జెట్​లో నిధులు కేటాయించింది. గత అనుభవాల దృష్ట్యా ఈసారి రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ప్రభుత్వం యోచిస్తోంది.

వ్యవసాయ రుణమాఫీ
author img

By

Published : Jun 1, 2019, 5:42 AM IST

Updated : Jun 1, 2019, 7:25 AM IST

హామీల అమలుపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం

శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం... ఒక్కొక్క అంశాన్ని కొలిక్కి తెస్తోంది. ఆసరా పింఛన్ల మొత్తం పెంపును జూన్ నుంచి అమలు చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. కీలకమైన రైతులకు వ్యవసాయ రుణాల మాఫీ ప్రక్రియపై కూడా సర్కార్ దృష్టి సారించింది. వ్యవసాయ రుణమాఫీకి ఎంత మంది అర్హులు? వాళ్ల సంఖ్య ఎంత ఉంటుందన్న విషయం పరిశీలిస్తున్నారు. గత డిసెంబర్ 11వ తేదీ వరకు ఉన్న లక్ష రూపాయల్లోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్​లోనూ నిధులు కేటాయించారు.

రూ. 6వేల కోట్ల కేటాయింపు...

రైతు రుణమాఫీ కోసం 6 వేల కోట్ల రూపాయలను పద్దులో కేటాయించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 33వేల కోట్ల రూపాయలకు పైగా వ్యవసాయ రుణాలు ఇచ్చారు. బ్యాంకర్ల సమితి ప్రాథమికంగా ఇచ్చిన నివేదిక ప్రకారం లక్ష రూపాయల్లోపు ఉన్న రుణాల మొత్తం 27వేల కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్లు సమాచారం.

సమగ్ర నివేదిక కోరిన అధికారులు..

రైతు రుణమాఫీకి సంబంధించి లక్ష రూపాయల్లోపు రుణాల వివరాలు పూర్తి స్థాయిలో సేకరించి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులు బ్యాంకర్ల సమితిని కోరారు. 2014 ఎన్నికల్లో లక్ష రూపాయల్లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన తెరాస... అధికారంలోకి వచ్చాక విడతల వారీగా నాలుగేళ్లలో దాన్ని అమలు చేసింది. గత మాఫీని నాలుగు విడతల్లో చేసినందున బ్యాంకుల నుంచి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతుల నుంచి కొందరు బ్యాంకర్లు వడ్డీ వసూలు చేయడం, కొత్త రుణాలు ఇవ్వకపోవడం లాంటి సమస్యలు తలెత్తాయి. తక్కువ రుణం ఉన్న వారు కూడా మాఫీ కోసం నాలుగేళ్ల పాటు ఆగాల్సి వచ్చింది.

తక్కువ రుణాలకు ఒకేసారి మాఫీ!

గత అనుభవాల నేపథ్యంలో ఈ మారు ఇబ్బంది లేకుండా రుణమాఫీ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రూ.50 వేల వరకు ఉన్న రుణాలను ఒకేసారి మాఫీ చేస్తే బాగుంటుందనే కోణంలో ఆలోచిస్తున్నారు. తక్కువ మొత్తం రుణం ఉన్న రైతన్నకు తక్షణమే ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. బ్యాంకర్ల ఖాతాలోకి నగదు జమచేయకుండా రైతుబంధు తరహాలో చెక్కులు ఇవ్వాలన్న ఆలోచన కూడా ఉంది. ప్రభుత్వం రుణమాఫీ విధివిధానాలను త్వరలోనే ప్రకటించనుంది. ఈ అంశంపై కొనసాగుతోన్న కసరత్తు పూర్తైతే ముఖ్యమంత్రి కేసీఆర్ దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ఇవీ చూడండి: రెండు వారాల్లోగా వార్డుల రిజర్వేషన్లు తేల్చండి: హైకోర్టు

Last Updated : Jun 1, 2019, 7:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.