సుమారు ఐదు లక్షల మంది ఆస్తమా రోగులకు సరిపడా చేప ప్రసాదాన్ని తయారు చేస్తున్నామని బత్తిని హరనాథ్ గౌడ్ తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈనెల 8 న సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిదో తేది సాయంత్రం ఆరు వరకు చేప ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు. మొత్తం 32 కౌంటర్లు, వృద్ధుల కోసం మరో కౌంటర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని, స్వచ్చంద సంస్థలు సైతం ముందుకొచ్చాయని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: బాధిత కుటుంబాలకు లక్ష్మణ్ పరామర్శ