ETV Bharat / briefs

మొదటి దశ స్థానిక ఎన్నికల బరిలో నిలిచింది వీరే - cpi

స్థానిక సంస్థల తొలిదశ పోలింగ్​కు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. 2,166 ఎంపీటీసీ స్థానాలకు 11,521 మంది, 197 జిల్లా పరిషత్ ప్రాదేశిక స్థానాలకు 1,562 మంది బరిలో నిలిచారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు తెరాస నుంచే అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఆ తరువాతి స్థానాల్లో కాంగ్రెస్‌, భాజపాలు ఉన్నాయి.

మొదటి దశ స్థానిక ఎన్నికల బరిలో నిలిచింది వీరే
author img

By

Published : Apr 26, 2019, 12:13 AM IST

మొదటి దశ స్థానిక ఎన్నికల బరిలో నిలిచింది వీరే

మొదటి దశలో ఎన్నికలు జరగనున్న స్థానిక సంస్థలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. 2,166 మండల పరిషత్ ప్రాదేశిక స్థానాలకు 11,521 మంది 15,036 నామినేషన్లు, 197 జిల్లా పరిషత్ స్థానాలకు 1562 మంది 2104 నామినేషన్లు దాఖలు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

పార్టీల వారీగా..

పార్టీల వారీగా జిల్లా పరిషత్ ప్రాదేశిక స్థానాలకు.. తెరాస-748, కాంగ్రెస్‌-551, భాజపా-276, తెదేపా-80, సీపీఎం-66, సీపీఐ-34, వైసీపీ-3, ఇతర పార్టీలు-45, స్వతంత్రులు-301 మంది నామపత్రాలు సమర్పించారు.

మండల పరిషత్ ప్రాదేశిక స్థానాలకు దాఖలైన 15,036 నామినేషన్లలో తెరాస-5762, కాంగ్రెస్‌-4178, భాజపా-1576, తెదేపా-227, సీపీఎం-284, సీపీఐ-182, ఎంఐఎం-01, వైసీపీ-1, ఇతర పార్టీలు-113, స్వతంత్రులు-2,712 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

జిల్లాల వారీగా..

జిల్లా పరిషత్​ ప్రాదేశిక స్థానాలకు అత్యధికంగా ఖమ్మం నుంచే 184 మంది పోటీపడుతున్నారు. నల్గొండ-102, సూర్యాపేట-102, సంగారెడ్డి-97, మహబూబాబాద్‌-96, కరీంనగర్‌-95, భద్రాద్రి కొత్తగూడెం-92, సిద్దిపేట-14, ములుగు-15, నారాయణపేట-19 చొప్పున దాఖలయ్యాయి.

మండల పరిషత్​ ప్రాదేశిక స్థానాలకు అత్యధికంగా నల్గొండ నుంచి 1104 మంది పోటీపడుతున్నారు. ఖమ్మం-820, సూర్యాపేట -742, సంగారెడ్డి -741, నాగర్‌కర్నూలు-733, సిద్దిపేట -681, కరీంనగర్‌-636, రంగారెడ్డి-630, కామారెడ్డి -598, మహబూబాబాద్‌-537, యాదాద్రి భువనగిరి-523, వికారాబాద్‌-515, పెద్దపల్లి-508 చొప్పున నామపత్రాలు దాఖలయ్యాయి. అతి తక్కువగా ములుగు, నారాయణపేట నుంచి రెండువందల లోపలే నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

ఇవీ చూడండి: ఆత్మహత్య చేసుకుంటారని... కాపలా ఉంటున్నాం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.