అమెరికా బౌంటిఫుల్ నగర శివారు ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పిడుగులు పడి అర్ధరాత్రి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల్లో మూడు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో 5 ఇళ్లు భారీగా దెబ్బతిన్నాయి. త్రుటిలో ప్రాణనష్టం తప్పింది.
బౌంటిపుల్లోని సాల్ట్‌లేక్ ప్రాంతం.. పిడుగులు పడి అగ్ని ప్రమాదానికి గురైంది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 400 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 150 నుంచి 300 ఎకరాల మేర మంటలు వ్యాపించాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
"సుమారు ఒంటి గంట సమయంలో భారీ పిడుగు తాకిడికి మంటలు అంటుకున్నాయి. పర్వతాల నుంచి బలమైన ఈదురు గాలులు వీచడం మూలంగానే మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం. ముందు జాగ్రత్తగా ఘటనా స్థలానికి పక్కనే ఉన్న సెంటర్ విల్లేలోని ప్రజలను ఖాళీ చేయించాం.
-పాల్ చైల్డ్, పోలీసు చీఫ్.
ఇదీ చూడండి : ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తావా.. గుంజీలు తీయ్!