ETV Bharat / briefs

కొనసాగుతున్న ఇంటర్​ బోర్డు నిర్లక్ష్యం - ANAMIKA

ఇంటర్​ ఫలితాల గందరగోళం ఇంకా వీడలేదు. బోర్డు తప్పులు కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగులో ఫెయిల్​ అయ్యాయనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది అనామిక. శనివారం నాడు రీవెరిఫికేషన్​లో ముందుగా పాసైనట్లు చూపించి.. మళ్లీ కొద్దిగంటలకే ఫెయిల్​ అయినట్లు వెబ్​సైట్​లో వెల్లడించింది.

కొనసాగుతున్న ఇంటర్​ బోర్డు నిర్లక్ష్యం
author img

By

Published : Jun 2, 2019, 5:51 AM IST

Updated : Jun 2, 2019, 7:07 AM IST

కొనసాగుతున్న ఇంటర్​ బోర్డు నిర్లక్ష్యం

ఇంటర్​ ఫలితాల వెల్లడిలో ఇంటర్మీడియట్ బోర్డు తప్పులు కొనసాగుతూనే ఉన్నాయి. రీవెరిఫికేషన్ ఫలితాల్లోనూ గందరగోళం సృష్టిస్తోంది. తెలుగులో 20 మార్కులు వచ్చి ఫెయిలైన బాధతో కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​కు చెందిన అనామిక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రీవెరిఫికేషన్​లో 48 మార్కులతో పాసైనట్లు శనివారం వెబ్​సైట్​లో వెల్లడించింది. ఒక్కసారిగా కంగుతిన్న అనామిక కుటుంబ సభ్యులు, బాలల హక్కుల సంఘం, సీపీఐ నాయకులు... ఇంటర్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అనామిక కుటుంబసభ్యులు ఆందోళన చేసేసరికి.. ఇంటర్ బోర్డు మళ్లీ వెబ్​సైట్​లో మార్కులు మార్చేసింది. అనామిక రీవెరిఫికేషన్​లోనూ ఫెయిలైందని చెబుతోంది. పునపరిశీలనలతో ఆమెకు ఒక్క మార్కే పెరిగి.. 21 మార్కులు వచ్చాయని తెలిపింది. అయితే ఆమెకు 48 మార్కులు వచ్చినట్లు పొరపాటున వెల్లడించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ పేర్కొన్నారు. మూల్యాంకన కేంద్రంలోని సిబ్బంది క్లరికల్ తప్పు వల్ల ఇలా జరిగిందన్నారు. అనామిక వ్యవహారంలో తప్పు ఎలా జరిగిందో తెలుసుకునేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు పేర్కొంది. అనామిక జవాబు పత్రాన్ని మీడియాకు బహిరంగ పరిచింది.

మే 27 సాయంత్రం 5 గంటల వరకు ఫలితాలతో పాటు... జవాబు పత్రాలను వెబ్​సైట్​లో వెల్లడించాలని హైకోర్టు స్పష్టం చేసినా.. ఆ ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదు. సుమారు ఆరు వేల సమాధానపత్రాలు ఇంకా స్కానింగ్, అప్ లోడ్ చేయాల్సి ఉందని ఇంటర్ బోర్డు ఇంకా చెబుతూనే ఉంది. జవాబు పత్రాల అప్​లోడ్​లో జాప్యం ఎందుకు జరుగుతోందన్న అనుమానాలు విద్యార్థులు, తల్లిదండ్రులను వెంటాడుతున్నాయి.

ఇవీ చూడండి: దిల్లీలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం

Intro:Body:Conclusion:
Last Updated : Jun 2, 2019, 7:07 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.