ETV Bharat / briefs

వెబ్​ఆప్షన్ల ప్రక్రియ మరోసారి వాయిదా - engeneering

ఇంజినీరింగ్ వెబ్ఆప్షన్ల నమోదు ప్రక్రియ మరోసారి వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ఫీజులు ఖరారు కావడానికి మరో వారం రోజులు పట్టే సూచనలు ఉన్నాయి.

వెబ్​ఆప్షన్ల ప్రక్రియ మరోసారి వాయిదా
author img

By

Published : Jul 3, 2019, 11:15 PM IST

ప్రైవేట్ కళాశాలల్లో ఫీజుల పెంపు ప్రక్రియపై ఇంకా స్పష్టత రానందున ఇంజినీరింగ్​ వెబ్​ ఆప్షన్ల ప్రక్రియ మరోసారి వాయిదాపడే అవకాశం కనిపిస్తోంది. గురువారం సమావేశం కానున్న ఎంసెట్ ప్రవేశాల కమిటీ వెబ్ ఆప్షన్ల ప్రక్రియపై నిర్ణయం తీసుకోనుంది. ఇవాళ్టితో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తైంది. మొత్తం 53వేల మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసుకొని ఐచ్ఛికాల కోసం వేచి చూస్తున్నారు.

ఇప్పటి వరకు హైకోర్టుకు వెళ్లిన 83 కాలేజీల యాజమాన్యాలతో ఏఎఫ్ఆర్​సీ చర్చలు జరిపింది. రేపటి నుంచి ఆరో తేదీ వరకు కోర్టును ఆశ్రయించని 109 కాలేజీలతో చర్చింనున్నారు. మొత్తం మీద 15 నుంచి 20 శాతం ఫీజులు తాత్కాలికంగా పెంచి.. మూడు నెలల్లో పూర్తి స్థాయిలో ఖరారు చేస్తామని కాలేజీలకు ఏఎఫ్ఆర్​సీ స్పష్టం చేసింది. అయితే చర్చలు పూర్తై మధ్యంతర ఫీజులు ఖరారు చేసి.. జీవో జారీ కావటానికి మరింత సమయం పట్టనున్నందున వెబ్​ఆప్షన్ల ప్రక్రియ వాయిదాపడే అవకాశముంది.

వెబ్​ఆప్షన్ల ప్రక్రియ మరోసారి వాయిదా

ఇదీచూడండి: బంగారంతో బుజ్జి ప్రపంచకప్​ చేసిన అభిమాని

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.