ETV Bharat / briefs

ఏపీకి వెళ్లేందుకు 'శ్రీలక్ష్మి' దరఖాస్తు - ias sri laxmi applied for ap cadre

ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి డిప్యుటేషన్​పై ఆంధ్రప్రదేశ్​కు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర విభజనలో తెలంగాణ కేడర్​లో ఉన్న ఆమె... తిరిగి ఏపీ వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఓబులాపురం గనుల వ్యవహారంలో సీబీఐ విచారణ ఎదుర్కొన్న శ్రీలక్ష్మి... ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

'శ్రీలక్ష్మి' దరఖాస్తు
author img

By

Published : May 28, 2019, 12:01 AM IST

ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి... డిప్యుటేషన్‌పై ఏపీకి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీలక్ష్మి కీలక పదవుల్లో పనిచేశారు. అనంతరం ఓబులాపురం గనుల వ్యవహారంలో చిక్కుకుని సీబీఐ తాఖీదులు అందుకున్నారు. ఈ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన శ్రీలక్ష్మి... రాష్ట్ర విభజనలో భాగంగా తెలంగాణ కేడర్‌ను ఎంచుకున్నారు.

ప్రస్తుత పరిస్థితుల రీత్యా తిరిగి ఏపీ కేడరుకు డిప్యుటేషన్​పై వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై జగన్, తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని కొందరు అధికారులు అంటున్నారు. ఇప్పటికే ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర డిప్యుటేషన్​పై ఏపీకి వెళ్తున్నట్లు సమాచారం. ఏపీకి డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు మరికొంతమంది ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి : జగన్​తో స్టీఫెన్ భేటీ... గంటసేపు ఆసక్తికర చర్చ

Intro:AP_ONG_11_27_MADALA_RANGARAO_VARDANTHI_AVB_C6
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
...................................................................................
కళ కళల కోసం కాదు ప్రజల కోసం అనే సూత్రాన్ని నమ్మి విప్లవ చిత్రాల నిర్మాతగా, దర్శకుడు గా, నటుడుగా ప్రజల మన్ననలు అందుకున్న రెడ్ స్టార్ మాదాల రంగారావు ప్రథమ వర్ధంతి సంస్మరణ సభ ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించారు. మాదాల రంగారావు తనయుడు రవి అధ్యక్షత న ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో జడ్పి చైర్మన్ ఈదర హరిబాబు, ప్రజా నాట్య మండలి నాయకుడు నల్లూరి వెంకటేశ్వర్లు, పారిశ్రామికవేత్త శిద్దా హనుమంతరావు, కమ్యూనిస్టు నాయకులు పాల్గొన్నారు. కళ ల పట్ల ఆయనకు ఉన్న మక్కువను ప్రశంసించారు . విప్లవ ఉద్యమంలో మాదాల రంగారావు చొరవను అభినందించారు. కమ్యూనిస్టు ల ఐక్యత కోసం మాదాల ప్రయత్నాన్ని స్మరించుకున్నారు. పీడిత వర్గాల సమస్యలు చిత్రాల ద్వారా పాలకుల కళ్ళకు కట్టిన తీరును గుర్తుచేసుకున్నారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైన నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం నిలబడిన వ్యక్తిత్వాన్ని ప్రశంసించారు... బైట్
మాదాల రవి, మాదాల రంగారావు తనయుడు.

Body:ongole

Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.