ETV Bharat / briefs

'సీఎం కేసీఆర్​ ఎన్నికల కోడ్​ ఉల్లంఘించారు' - EC NOTICES TO KCR

ఎన్నికల సమయంలో నిర్వహించిన ఓ ప్రచారసభలో సీఎం కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా అనుచిత వ్యాఖ్యలు చేసి ఎన్నికల కోడ్​ను ఉల్లఘించారంటూ.... ఓ వ్యక్తి ఈసీకి ఫిర్యాదు చేశారు. విచారించిన కేంద్ర ఎన్నికల సంఘం... ఎన్నికల నియమావళిని ఉల్లఘించినట్లు... నిర్ధరించింది. ఇంకోసారి ఇలా కాకుండా చూసుకోవాలని హెచ్చరించింది.

కేసీఆర్ఈ​కు ఈసీ చురకలు
author img

By

Published : May 4, 2019, 12:21 AM IST

Updated : May 4, 2019, 8:19 AM IST

సీఎం కేసీఆర్‌ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు సీఈసీ గుర్తించింది. ఎన్నికల సమయంలో బహిరంగ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు నియమావళికి విరుద్ధమని పేర్కొంది. కేంద్ర ఎన్నికల సంఘం ఏప్రిల్ 9న ఇచ్చిన నోటీసుకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి... తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరించారు. కేసీఆర్ సమాధానానికి బదులుగా ఎన్నికల సంఘం లేఖ పంపింది.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ముఖ్యమంత్రి ఉల్లంఘించారని ఈసీ లేఖలో స్పష్టంగా పేర్కొంది. బహిరంగ సభలో కేసీఆర్‌ మాటలను అన్ని ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయని అధికారులు వెల్లడించారు. దురుద్దేశపూర్వకంగానే కేసీఆర్‌ మాట్లాడినట్లు ఈసీ గుర్తించిందని లేఖలో తెలిపారు. భవిష్యత్‌లో మరోసారి ఇలాంటివి జరగకుండా జాగ్రత్త వహించాలని గులాబీ బాస్​ను ఈసీ హెచ్చరించింది.

ఇవీ చూడండి: మొదటి విడత ఎంసెట్​ ప్రశాంతం...

Last Updated : May 4, 2019, 8:19 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.