మొదటి విడత ఎంసెట్ పరీక్ష ముగిసింది. తొలిసారిగా ఆన్లైన్లో పరీక్షలను నిర్వహించారు. ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు నిర్వహించారు. ఇందు కోసం రాష్ట్రంలోని 15 పట్టణాల్లో 83 కేంద్రాలు, ఏపీలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలోని 11 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆన్లైన్ ఎంసెట్ పరీక్షల నిర్వహణ కోసం అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఒక్క నిమిషం నిబంధన ఉన్నందున విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఒక్క నిమిషం నిబంధన వల్ల కొన్ని కేంద్రాల వద్ద విద్యార్థులు చివరి నిమిషంలో పరుగెడుతూ కనిపించారు. 3 విడతలుగా ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. 4, 6 తేదీల్లో ఇంజినీరింగ్, 8, 9 తేదీల్లో అగ్రికల్చర్-ఫార్మసీ పరీక్ష జరగనుంది.
ఇవీ చూడండి: సీఈసీకి ఫిర్యాదు చేయనున్న పసుపు రైతులు