ETV Bharat / briefs

'ఈనెల 15లోగా దోస్త్​లో ఆన్​లైన్​ రిపోర్టింగ్​ చేయాలి' - దోస్త్​ కన్వీనర్​ లింబాద్రి

డిగ్రీలో ప్రవేశాలకు మొదటి విడతలో 1,05,433  సీట్ల కేటాయించామని దోస్త్​ కన్వీనర్​ లింబాద్రి పేర్కొన్నారు. ప్రవేశాలకోసం విద్యార్థులు ఆన్​లైన్​లో సీటును ధ్రువీకరించుకోవాలని సూచించారు.

'ఈనెల 15లోగా దోస్త్​లో ఆన్​లైన్​ రిపోర్టింగ్​ చేయాలి'
author img

By

Published : Jun 10, 2019, 7:22 PM IST

డిగ్రీలో ప్రవేశాలకోసం దోస్త్​కు సంబంధించిన ప్రక్రియ మే 23 నుంచి ప్రారంభమైందని దోస్త్​ కన్వీనర్​ లింబాద్రి తెలిపారు. రాష్ట్రంలోని 1110 కళాశాలలకు గాను 980 కళాశాలల్లో దోస్త్​ ద్వారా ప్రవేశాలు కల్పిస్తామని వివరించారు. సీట్​ కోసం విద్యార్థులు కళాశాలలకు వెళ్లనవసరం లేదని ఆన్​లైన్​లోనే దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. సీటు ధ్రువీకరణ అయిన తర్వాత ఆన్​లైన్​లో ధ్రువీకరించుకోకపోతే సీటు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈనెల 15లోపు విద్యార్థులు ఆన్​లైన్​లో రిపోర్టింగ్​ చేయాలని పేర్కొన్నారు. మొదటి విడతలో సీటు కోల్పోయిన విద్యార్థులకు రెండో విడతలో అవకాశం ఉంటుందన్నారు. దోస్త్​ ద్వారా వెళ్లకపోతే ఉపకారవేతనాలకు అనర్హులవుతారని పేర్కొన్నారు.

'ఈనెల 15లోగా దోస్త్​లో ఆన్​లైన్​ రిపోర్టింగ్​ చేయాలి'
ఇదీ చదవండి: సికింద్రాబాద్​లో 8వేల కిలోల వెండి పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.