ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి ఆరోపించారు. సీఎం ఇష్టం వచ్చినట్లుగా చట్టాలు చేస్తామంటే రాజ్యాంగం ఒప్పుకోదని తేల్చి చెప్పారు. కలెక్టర్ల అధికారాలు మంత్రులకు అప్పగిస్తామనడం సరైనది కాదని తెలిపారు. జిల్లా ప్రథమ పౌరుడి అధికారాలను మంత్రులకు కట్టబెట్టి... మంత్రులపై గులాబీ దళపతి అధికారం చెలాయించాలని చూస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే కేసీఆర్ కుటుంబపాలనతో రాష్ట్రం అతలాకుతలం అయిందన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరు నిర్ణయాలు చేయడానికి వీలులేదన్నారు. రెవెన్యూను పంచాయితీరాజ్‌లో విలీనం చేయడం ద్వారా గ్రామాల్లో రాజకీయ జోక్యాన్ని ప్రోత్సహించడమే అవుతుందని సమరసింహా రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: చేతులు బొబ్బలెక్కినా 'ఉపాధి' గిట్టుబాటు కావట్లేదు