రాష్ట్ర పోలీసు నియామక మండలి చేపట్టిన కానిస్టేబుల్ ఉద్యోగాలకు నేడు తుది రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షలు జరుగుతాయి. ఉమ్మడి పది జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 188 కేంద్రాల్లో 1,05,094 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. దేహదారుఢ్య పరీక్షల సమయంలో అక్కడక్కడా అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలతో పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. 16 వేల 925 కానిస్టేబుల్ పోస్టులను పోలీసు నియామక మండలి భర్తీ చేయనుంది.
నేడే కానిస్టేబుల్ ఉద్యోగాల తుది రాత పరీక్ష - telangana police
పోలీస్ కానిస్టేబుల్ నిమాయమకాలకు నేడు తుది రాత పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 188 పరీక్షా కేంద్రాల్లో లక్షా ఐదు వేల 94 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.