రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌పై అనుమానాలున్నాయని కాంగ్రెస్ నేతలు దిల్లీలో ఈసీఐని కలిసి ఫిర్యాదు చేశారు. మర్రి శశిధర్‌రెడ్డి, రేణుక చౌదరి, నిరంజన్ రెడ్డి తమ సందేహాలను ఈసీకి వెల్లడించారు. సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ శాతం పెరగటాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లామని శశిధర్ రెడ్డి తెలిపారు. పోలింగ్ అనంతరం సీఈవో చేసిన వ్యాఖ్యలపైన అభ్యంతరాలు తెలిపారు. రజత్ కుమార్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా పోలింగ్ శాతం చెప్పారని ఆరోపించారు. పోలింగ్ శాతంపై లోతుగా అధ్యయనం చేసి నిగ్గు తేలుస్తామన్నారు. పోలింగ్ శాతం అనూహ్యంగా పెరగటంపై అన్ని ఆధారాలతో ఈసీకి ఫిర్యాదు చేశామని రేణుక చౌదరి తెలిపారు. ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి కచ్చితంగా తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: స్థానిక సంస్థలు 'చే' జారకుండా కాంగ్రెస్ కసరత్తు