ETV Bharat / briefs

పోలీసుల నిర్బంధంతో ఉద్యమాలను ఆపలేరు: చాడ

ఇంటర్​బోర్డు వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. కార్యాలయ ముట్టడికి యత్నిస్తున్న రాజకీయ, విద్యార్థినాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. నిరసనకు యత్నించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

chada-
author img

By

Published : Apr 29, 2019, 11:53 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ పోలీసులను ఉపయోగించి ఉద్యమాలను ఆపేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ఇంటర్​ పరీక్షల్లో అవకతవకలపై విచారణ కోరుతూ.. విపక్షాలు బోర్డ్ ముట్టడికి యత్నించాయి. కార్యాలయం వద్ద పోలీసులు చాడాను, ఇతర సీపీఐ నేతలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై చాడా మండిపడ్డారు. అన్యాయంగా అరెస్టుచేస్తున్న వారందరినీ తక్షణమే విడదల చేయాలని డిమాండ్​ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగేంతవరకూ పోరాడతామన్నారు.

పోలీసుల నిర్బంధంతో ఉద్యమాలను ఆపలేరు: చాడ

ఇదీ చదవండి:ఎల్.రమణను అరెస్ట్ చేసిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.