తెదేపా రాజ్యసభ పక్ష విలీన ప్రక్రియ రాజ్యాంగబద్ధంగానే జరిగిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి ఉద్ఘాటించారు. కొందరు ఈ అంశాన్ని అనవసర వివాదం చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారమే విలీన ప్రక్రియ జరిగిందని తెలిపారు. కొందరు తమ అవగాహనరాహిత్యంతో విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెదేపా రాజ్యసభ సభ్యుల లేఖ మేరకు వారిని భాజపా సభ్యులుగా గుర్తించినట్లు కిషన్రెడ్డి స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: చిన్నారి నిండు ప్రాణాన్ని టిప్పర్ తొక్కేసింది