కొత్తగా రూపొందించిన ముమ్మారు తలాక్ బిల్లును పార్లమెంటు ముందుకు తెచ్చేందుకు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. సోమవారం ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు. గత ఎన్డీఏ ప్రభుత్వం ఫిబ్రవరిలో జారీ చేసిన ఆర్డినెన్సు స్థానంలో నూతన బిల్లు తెస్తున్నట్లు చెప్పారు జావడేకర్.
ఈ బిల్లును ఎన్డీఏ-1 హయాంలో పార్లమెంటులో ప్రవేశపెట్టినా తగిన సంఖ్యా బలం లేని కారణంగా ఆమోదం పొందలేదు.
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో దిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్... మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. జమ్ముకశ్మీర్లో జులై 2న ముగియనున్న రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించింది. జులై 3 నుంచి ఇది అమల్లోకి రానుంది.
జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుతో అంతర్జాతీయ సరిహద్దు గ్రామాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు జావడేకర్. విద్య, ఉద్యోగం, పదోన్నతుల్లో సరిహద్దు ప్రజలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు చెప్పారు.
కేంద్రీయ విద్యాసంస్థల్లో 7 వేల మంది అధ్యాపకుల పోస్టులు భర్తీ చేసే బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఇదీ చూడండి: