యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారంలో పేలుడు సంభవించింది. రెజినీసిస్ ఎక్స్‌ప్లోజివ్స్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు బాంబు పేలింది. పేలుడు ధాటికి ఓ యువకుడి శరీరం ముక్కలైపోయింది. మాంసపు ముద్దగా మారింది. మృతుడు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కశ్యప్‌గా గుర్తించారు. కంపెనీ యాజమాన్యం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు భువనగిరి సీఐ తెలిపారు. ఇలాంటి ఘటనలకు కారణం అవుతున్న పరిశ్రమలను నిర్మూలించాలని స్థానికులు కంపెనీ ఎదుట ఆందోళన చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: బావిలో పడి బతికొచ్చాడు...