ETV Bharat / briefs

ఇంటర్​ విద్యార్థులకు అండగా ఉంటాం: లక్ష్మణ్​ - telangana inter results

ఇంటర్​ పరీక్ష నిర్వహణకు ప్రభుత్వ సంస్థ ఉండగా గ్లోబరీనాకు ఎందుకు అవకాశం ఇచ్చారో తెలపాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్​ డిమాండ్​ చేశారు. ఈ వ్యవహారంపై న్యాయవిచారణ చేసి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని సీఎస్​ జోషికి వినతిపత్రం సమర్పించారు.

ఇంటర్​ విద్యార్థులకు అండగా ఉంటాం: లక్ష్మణ్​
author img

By

Published : Apr 23, 2019, 7:56 PM IST

ఇంటర్మీడియట్​ ఫలితాల వ్యవహారంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందొద్దని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం మెడలు వంచి అందరికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ప్రభుత్వ సంస్థ అయిన సెంటర్​ ఫర్​ గుడ్​ గవర్నెన్స్​ను కాదని గ్లోబరీనా అనే ప్రైవేటు సంస్థకు ఎందుకు అవకాశం ఇచ్చారో తెలపాలని డిమాండ్​ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ భాజపా నేతలు సీఎస్​ జోషికి వినతిపత్రం సమర్పించారు. ఇంత పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి తీరు ఆక్షేపణీయమన్నారు. ఆయన భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు.

ఇంటర్​ విద్యార్థులకు అండగా ఉంటాం: లక్ష్మణ్​

ఇవీ చూడండి: బోర్డ్​ ఆఫ్​ ఇంటర్మీడియేట్టా.. పోలీస్​ ఎడ్యుకేషనా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.