పశ్చిమ బంగాలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే విధంగా మమతాబెనర్జీ దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సభలో జరిగిన హింసకు నిరసనగా సికింద్రాబాద్ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో లక్ష్మణ్‌తో పాటు ఎమ్మెల్సీ రామచందర్ రావు, భాజపా కార్యకర్తలు పాల్గొన్నారు. మమతా బెనర్జీ గూండాయిజంతో భాజపా శ్రేణులను భయభ్రాంతులకు గురి చేస్తూ దాడులకు తెగబడుతున్నారని నేతలు మండిపడ్డారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని హింసకు పాల్పడుతూ మరోసారి గద్దెనెక్కాలనుకోవటం దారుణమని ఆక్షేపించారు.
ఇవీ చూడండి: డ్రగ్ కేసులో సినీతారలకు క్లీన్చిట్ ఇవ్వలేదు