పశువ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా బయోవెట్ సంస్థ వ్యాక్సిన్ల ఉత్పత్తిని విస్తృతం చేస్తోందని బయోవెట్ వ్యవస్థాపకుడు డాక్టర్ కృష్ణ ఎల్లా వెల్లడించారు. జంతువులకు సోకే ఫుట్ అండ్ మౌత్ వ్యాధి, బ్రూసెల్లోసిస్ వ్యాధులను నివారించే ఎఫ్ఎండీ వ్యాక్సిన్ల ఉత్పత్తిని 200 మిలియన్ డోసుల నుంచి 500 మిలియన్ డోసులకు పెంచనున్నామన్నారు. కర్ణాటకలోని మాలూర్‌లో 200 కోట్ల పెట్టుబడితో మరో పరిశ్రమను నెలకొల్పనున్నట్లు పేర్కొన్నారు. దేశంలో ఏర్పడ్డ ఎఫ్ఎండీ వ్యాక్సిన్ల కొరతను తగ్గించడంతో పాటు స్థానికులకు పెద్దమొత్తంలో ఉపాధి కల్పించేందుకు మాలూర్‌లోని వ్యాక్సిన్ తయారీ కేంద్రం దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
ఇదీ చూడండి: ఆటోవాలా చల్లని ఐడియా.. నెటిజన్లు ఫిదా