ఇంతకాలం బాలీవుడ్ చిత్రసీమకే పరిమితమైన బిగ్‌బి అమితాబ్ బచ్చన్.. దక్షిణాది సినిమాల వైపు దృష్టిసారించాడు. కోలీవుడ్‌లో తమిళ్‌వాణన్ తెరకెక్కిస్తున్న ‘ఉయర్నత మణిదాన్’లో కీలకపాత్రలో కనిపించనున్నాడు. సంబంధిత ఫొటోలను ట్విట్టర్లో పంచుకున్నాడు నటుడు ఎస్.జె. సూర్య.
అమితాబ్ సర్‌తో కలిసి పనిచేస్తున్నా. నా జీవితంలోనే అత్యంత ఆనందకరమైన క్షణమిది. నేనెప్పుడూ కనని కల నెరవేరింది. ఈ సందర్భంగా దేవుడికి, అమ్మానాన్నలకు, సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు, మురుగదాస్‌కు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా
--ట్విట్టర్లో ఎస్.జె.సూర్య
ఇందులో బిగ్‌బీకి జోడీగా రమ్యకృష్ణ నటించబోతున్నట్లు సమాచారం. తమిళంతో పాటు హిందీ, తెలుగు భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానుంది.
ఇటీవలే చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’లో షూటింగ్‌ను పూర్తి చేసుకున్నాడు అమితాబ్.