ప్రశ్నించే గొంతును నొక్కడమే రాజకీయమా అని నిలదీశారు. ప్రతిపక్షం అంటే అంత భయమా అని ధ్వజమెత్తారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కేసీఆర్ దాన్ని గొప్పగా చెప్పుకోవడంపై మండిపడ్డారు. దేశానికి దిశానిర్దేశం, ఆదర్శం అంటే ఇదేనా అని ఎద్దేవా చేశారు.
సీఎంకు రాజ్యాంగంపై ఏ మాత్రం గౌరవం ఉన్నా...పార్టీ ఫిరాయింపులను ఆపాలని డిమాండ్ చేశారు. పార్టీని వీడిన ఎమ్మెల్యేలు...కాంగ్రెస్ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా మళ్లీ పోటీ చేయాలని భట్టి స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:సభను విజయవంతం చేయండి