జాన్ అబ్రహం నటించిన కొత్త చిత్రం బాట్లా హౌస్. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వసూళ్ల పరంగా దూసకెళ్తోంది. శనివారానికి రూ. 75 కోట్ల మార్కును అధిగమించింది. మొత్తంగా రూ. 76.57 కోట్లతో విజయవంతంగా ప్రదర్శితమవు తోంది.
2008 సెప్టెంబరు 19న దిల్లీలో జరిగిన బాట్లా హౌస్ ఎన్కౌంటర్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దిల్లీ పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదాలు హతమయ్యారు. బూటకపు ఎన్‌కౌంటర్‌గా ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసులు వాటిని ఎలా ఛేదించారు అనేది ప్రధాన కథాంశం.
నిఖిల్ అడ్వాణీ తెరకెక్కించిన బాట్లా హౌస్ చిత్రంలో మృణాల్ ఠాకుర్ హీరోయిన్. పింక్ సినిమాకు కథ అందించిన రితేశ్ షా ఈ సినిమాకు రచయిత.
సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అక్షయ్ కుమార్ మిషన్ మంగళ్ ముందు సత్తాచాటలేకపోతోంది. ఆ చిత్రం 150 కోట్లతో దూసుకెళ్తోంది.
ఇదీ చదవండి: 'మేజర్' కోసం అడివి శేష్ నయా అవతారం