ETV Bharat / briefs

పౌరసరఫరాల సేవలు అమోఘం - bangladesh teem visit

తెలంగాణలో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలు బాగున్నాయని బంగ్లాదేశ్​కు చెందిన ప్రతినిధుల బృందం కొనియాడింది. పౌరసరఫరాల శాఖ అవలంబిస్తున్న విధానాలు తెలుసుకునేందుకు బంగ్లాదేశ్​కు చెందిన అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చింది.

పౌరసరఫరాల సేవలు అమోఘం
author img

By

Published : Jun 13, 2019, 9:15 PM IST

Updated : Jun 18, 2019, 10:58 AM IST

బంగ్లాదేశ్‌కు చెందిన 37 మంది అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ అధికారులు హైదరాబాద్ ఎర్రమంజిల్‌ పౌరసరఫరాల భవన్‌లో కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ అధికారుల బృందం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ పనితీరు, వేలిముద్రలతో రేషన్‌ పంపిణీ, ఈపోస్‌ విధానం, ఐరిస్‌ విధానం, టీ-రేషన్‌ యాప్‌, పోర్టబిలిటీ, గోదాముల్లో సీసీ కెమెరాలు, రేషన్‌ సరకులు తరలించే వాహనాలకు జీపీఎస్‌, ఆన్‌లైన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ - ఓపీఎంఎస్‌ పనితీరు పరిశీలించింది.

రేషన్‌ సరకుల పంపిణీ విధానం, షాపులు, కార్డులు సంఖ్య, అక్రమాలకు తావులేకుండా అర్హులైన లబ్ధిదారులకు ఏ విధంగా సరకులు చేరుతున్నాయనే అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా పంపిణీ విధానం ద్వారా 2.83 కోట్ల మంది లబ్థిదారులకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17,200 రేషన్‌ షాపుల ద్వారా ప్రతి నెలా కిలో బియ్యం 1 రూపాయి చొప్పున ప్రతి పౌరుడికి 6 కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నామని కమిషనర్​ తెలిపారు. ఇందుకోసం 1.75 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నామని వివరించారు. రేషన్‌ బియ్యం పక్కదారి పట్టకుండా నూరు శాతం ఆధార్‌ అనుసంధానంతో ఈపాస్‌, ఐరిస్‌ విధానం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నామని చెప్పారు. పౌరసరఫరాల శాఖలో చేపట్టిన చర్యలు పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా విదేశీ ప్రతినిధులకు వివరించారు.

పౌరసరఫరాల సేవలు అమోఘం

ఇదీ చూడండి: తారక్​ ప్రభు ఆచూకీ నెల్లూరులో లభ్యం

Intro:Body:Conclusion:
Last Updated : Jun 18, 2019, 10:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.