జలవనరుల సంరక్షణలో ఈటీవీ తెలంగాణకు అవార్డు జాతీయ జల అవార్డులను కేంద్ర జలవనరుల శాఖ ప్రదానం చేసింది. ఉత్తమ నీటి సంరక్షణ చర్యలు, నిర్వహణ, వినియోగంలో ఉత్తమ ఫలితాలు కనబరిచిన రాష్ట్రాలు, జిల్లాలు, మీడియా సంస్థలకు ఈ అవార్డులు దక్కాయి. దిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అవార్డులను ప్రదానం చేశారు. నీటి నిర్వహణ, యాజమాన్య విధానం, ఉత్తమ ప్రదర్శనల విభాగంలో ఈటీవీ తెలంగాణకు రెండో స్థానం లభించింది. సంస్థ తరపున న్యూస్ ఎడిటర్ ఎన్.రాజేంద్రప్రసాద్ నితిన్ గడ్కరీ నుంచి అవార్డును అందుకున్నారు. భూగర్భ జలాల పెంపుదలలో కామారెడ్డి జిల్లాకు ద్వితీయ బహుమతి వరించింది.
ఇవీచదవండి:పద్మారావు గౌడ్ ఏకగ్రీవం