దివంగత అరుణోదయ రామారావు బుర్రకథలు, వీధి భాగోతాలు వందల సంఖ్యలో ప్రదర్శించి నాటక రంగానికి ఎనలేని సేవ చేశారని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు పి. నాగన్న కొనియాడారు. అరుణోదయ రామారావు సంస్మరణ సభ గోడ పత్రికను హైదరాబాద్ విద్యానగర్లోని మార్క్స్ భవన్లో ఆవిష్కరించారు. సంతాప సభను ఈనెల 17 న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అరుణోదయ రామారావు గొంతు విని సినీ రంగానికి రావాలని ఘంటసాల ఆహ్వానించారని గుర్తుచేసుకున్నారు. సాంస్కృతిక ఉద్యమంతో పాటు విప్లవ పార్టీ నిర్మాణంలో అంచెలంచెలుగా ఎదిగి రామారావు... సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు అయ్యారని నాగన్న తెలిపారు.
ఇవీ చూడండి: ఈనెల 27న రీవెరిఫికేషన్ ఫలితాల విడుదల